• Jul 26, 2026
  • NPN Log

    అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన  సినిమా  'లెనిన్'.  మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలు.  జూలై 10న గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్  అందరితో  సోమవారం బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌ నిర్వహించారు. డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీంకి షీల్డ్స్‌ను అందించారు.

    ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ 'తమ్ముడు కాస్త లేట్‌గా వచ్చినా.. అభిమానులు మాత్రం లేటెస్ట్‌గా సపోర్ట్ చేశారు. ఈ కథకి ఓకే చెప్పిన వెంటనే అఖిల్ సక్సెస్ కొట్టాడని ఫిక్స్ అయ్యాను. లెనిన్ కారెక్టర్‌కి, అఖిల్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ లెనిన్ పాత్ర కోసం అఖిల్ పూర్తిగా మారిపోయాడు. ఓ అన్నయ్యగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నాన్న గారి ఫైర్ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు, అఖిల్‌కి మాత్రమే తెలుసు. నాన్న చేసిన డేరింగ్ స్టెప్స్‌తో ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి చిత్రాలు వచ్చాయి. అలానే ఈ ‘లెనిన్’ను అంతే డేరింగ్‌గా తీసి చూపించారు. ఓ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో నాగవంశీకి బాగా తెలుసు. ‘లెనిన్’లోని క్లైమాక్స్, వసంత్‌  పెర్ఫర్మ్  చేసిన ఓ సీన్ నాకు చాలా ఇష్టం. తమన్ ఆర్ఆర్‌తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకు వెళ్లారు. భాగ్యశ్రీ మంచి ఆర్టిస్ట్. ఆమెకు ఓ మంచి కమర్షియల్ హిట్ పడాలని అనుకున్నాను. ఇలా షీల్డ్ ఫంక్షన్ చేసి చాలా రోజులైంది. మళ్లీ ఇలా ‘లెనిన్’ మూవీకి చేస్తుండటం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగుంటే.. ఇండస్ట్రీ అంతా బాగుంటుంది.  నా బేబీ సిసింద్రీకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియెన్స్‌కి,  మాకు సపోర్ట్ చేస్తున్న అక్కినేని అభిమానులందరికీ థాంక్స్' అని అన్నారు, 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement