• Jul 26, 2026
  • NPN Log

    ఏడాదిలో ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి (తొలి ఏకాదశి)కి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండగ నుంచే తెలుగు వారికి ముఖ్యమైన పండగలు ప్రారంభమవుతాయని శాస్త్రం చెబుతోంది. ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. దక్షిణాయానం ప్రారంభమైన తర్వాత వచ్చే ఏకాదశి కాబట్టి ఈ పండగను తొలి ఏకాదశి అని పేర్కొంటారు. ఈ ఏడాది తొలి ఏకాదశి.. జులై 25వ తేదీ శనివారం వచ్చింది.

    తొలి ఏకాదశి తిథి..

    తిథి ప్రారంభం: జులై 24 శుక్రవారం ఉదయం 10.08 గంటలకు.

    తిథి ముగింపు: జులై 25 శనివారం ఉదయం 11.54 గంటలకు.

    అయితే తొలి ఏకాదశి ఘడియలు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ సూర్యోదయం వేళ.. ఏ తిథి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు. దాంతో తొలి ఏకాదశి శనివారంగా పరిగణిస్తారు. ఇక ఈ రోజు.. పెద్దలకు బట్టలు పెడితే మంచిది. అంటే.. కొత్త వస్త్రాలు కొనుగోలు చేసి.. వాటిని దేవుని వద్ద ఉంచాలి. పూజ అయిన తర్వాత.. ఆ వస్త్రాలను ఎవరో ఒకరికి దానంగా ఇవ్వాలి. కొన్ని రోజుల తర్వాత అయినా వాటిని పెద్దలకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల.. కుటుంబానికి మంచి జరుగుతుందని పెద్దలు చెబుతారు.

    ఏం చేయాలంటే..

    ఈ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి పసుపు, రంగు దుస్తులు ధరించాలి.

    శ్రీమహావిష్ణువు, శ్రీలక్ష్మీ దేవిని పూజించాలి.

    ఉపవాసం పాటిస్తే మంచిది.

    ధనం, ధాన్యం, వస్త్రాలు దానంగా ఇవ్వాలి.

    శ్రీహరికి నైవేద్యంలో.. పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉంచాలి.

    ఏం చేయకూడదంటే..

    తామసిక ఆహారాన్ని తిన వద్దు.

    పెద్దలు, స్త్రీలను అవమానించవద్దు.

    ఈ రోజు బ్రహ్మచర్యం పాటించాలి.

    తులసి ఆకులను మొక్క నుంచి తెంప వద్దు.

    ఉపవాసం ఉన్న వ్యక్తి.. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు.

    ఈ రోజు స్త్రీలు తలస్నానం చేయకూడదు.

    గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.

    మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement