• Jul 26, 2026
  • NPN Log

    మైత్రీ మూవీ మేకర్స్  బ్యానర్ నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ . ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్  సమర్పిస్తోన్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

    సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, విడుదలకు మరో రెండు వారాల సమయం ఉండడంతో త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నామని ఈ అప్డేట్‌తో మేకర్స్ తెలిపారు.

     

    ఈ చిత్రానికి దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా, వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఉల్లాస్ హైడూర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడటంతో, త్వరలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి, సరికొత్త అనుభూతిని ఇస్తుందని మైత్రీ నిర్మాతలు చెబుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement