బస్సెక్కాలంటే సాహసం చేయాల్సిందే!
ఒంగోలు : వేసవి సెలవులు వచ్చాయంటే ముందుగా గుర్తుకొచ్చేది పల్లెటూర్లు. కనీసం వారంరోజులైనా ఊరు వెళ్లేందుకు అత్యధికశాతం ప్రజలు ఆసక్తి చూపుతారు. మధ్యతరగతి ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే బస్సుల్లో సీటు దొరికడం లేదు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న స్త్రీశక్తి, దివ్యాంగశక్తితో బస్సులన్నీ ఫుల్ అయిపోతు న్నాయి. గంటల తరబడి బస్టాండ్‌లో పడిగాపులు కాసి తీరా బస్సు వచ్చాక సీట్లు ఖాళీ లేకపోవడంతో పిల్లలు, పెద్దలు నిలువుకాళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయకపో వడంతోఉన్న వాటిలోనే వెళ్లాల్సి వచ్చి ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. మొత్తంగా ప్రస్తుతం ఆర్టీసీలో ప్రయాణమంటే సాహసం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం రీజియన్ పరిధిలో ఒంగోలు, మార్కాపురం కనిగిరి, గిద్దలూరు, పొదిలి, ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలోని 866 గ్రామాలకు అనుసంధానంగా 20 బస్‌స్టేషన్లు ఉన్నాయి. అలాగే 484 బస్సులు ఉండగా వాటిలో 95 అద్దె ప్రాతిపదికన నడస్తున్నాయి. ఈ బస్సులన్నీ రోజుకు సుమారు 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణికుల కోసం రాకపోకలు సాగిస్తున్నాయి. అందులోస్త్రీశక్తి పథకం ప్రారంభానికి ముందుకు 1.5 లక్షల మంది ప్రయాణించగా, ప్రస్తుతం రోజు2.5 లక్షలమంది ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు.293 బస్సులు స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాలకు కేటాయించడంతో అవన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కారణంగా నూరుశాతం సీట్లను మహిళలే వినియోగించుకోవడంతో మిగిలిన వారు నిలబడి ప్రయాణించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక బస్ సీటింగ్ కెపాసిటీ 55 సీట్లు అయితే ప్రస్తుతం ట్రిప్‌నకు వందమందికిపైగా ప్రయాణికులు ఎక్కడం విశేషం.










Comments