• May 26, 2026
  • NPN Log

    అమరావతి : రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం కడపలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. నంద్యాల జిల్లా సంజామలలో 44, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం లో 43.8, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43.2, కర్నూలు జిల్లా గూడూరులో 43, పల్నాడు జిల్లా దుర్గిలో 42.8, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.4, ప్రకాశం జిల్లా అద్దంకి, శ్రీసత్యసాయి జిల్లా తలుపులలో 42.3, అన్నమయ్య జిల్లా నూలివీడులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement