• Jul 26, 2026
  • NPN Log

    *ఘనంగా "డాక్టరు శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ"  జయంతి*

    *శ్రీకాళహస్తిలో వాడవాడలా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 135వ జయంతి వేడుకలు*

    *-కోలా ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు*

            *భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు మరియు ప్రముఖ జాతీయవాది అయిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని శ్రీకాళహస్తి బెరివారి మండపం కూడలిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 6న ముఖర్జీ గారి జయంతిని దేశం మొత్తం ఘనంగా జరుపుకుంటాము. 1901 జూలై 6న జన్మించిన ఆయన, అఖండ భారతదేశం మరియు జాతీయ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి,  కాశ్మీర్ అంశంపై నెహ్రూ విధానాలను వ్యతిరేకించి, 1951లో భారతీయ జనసంఘ్ ( నేటి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ )ను స్థాపించారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని నొక్కి చెబుతూ "ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా..."  అంటే ఒక దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు ఉండవు అని బలంగా నినదించారు. ఆయన గారి ఆలోచనలను ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమలు పరుస్తున్నారని, ముఖర్జీ గారి అడుగుజాడల్లో యువత పయనించాలని కోలా ఆనంద్ పిలుపునిచ్చారు.*
      *ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,  జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు ఆర్ హరీష్ రెడ్డి, జిల్లా మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, , ఉపాధ్యక్షురాలు రామ్ ఉమా సింగ్, సీనియర్ నేతలు గరికపాటి రమేష్ బాబు, జివి ఆమర్నాధ్, కన్నా వెంకటేశ్వర్లు, మద్దు వాసు యాదవ్, పుణ్యం డిల్లీ కుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, లింగాబత్తిన గోపాల్, తానికొండ్ల భరత్ నాయుడు, పెద్దదాసరి శివారెడ్డి, బొక్కసం కిరణ్మణి, చోటు, సుబ్బరామిరెడ్డి, వెంకట సుబ్బయ్య, చెందు, కుమార్, వీరస్వామి, కుమార్ నాయుడు, గోవర్ధన్, మురళీ, యశ్వంత్, నాగశేషు, శివా యాదవ్, గాధిపాకుల యతీశ్, హుకీం సింగ్, కోలే షణ్ముగం, సజ్జా హరీష్,  రాజు, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.*

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement