స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబును పరామర్శించిన ధర్మతేజ
కుందుర్పి:
ఇటీవల ప్రమాదంలో గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మండల కేంద్రానికి చెందిన స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబును టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ ఆదివారం పరామర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనల మేరకు రాంబాబు నివాసానికి వెళ్లిన ధర్మతేజ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం గురించి ఆరా తీశారు. రాంబాబు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









Comments