• May 26, 2026
  • NPN Log

    ఇండియన్‌ ఆర్మీలో నాయక్‌గా పనిచేస్తున్న అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామానికి చెందిన రాపేటి పూర్ణచంద్రశేఖర్‌ (37) ప్రమాదవశాత్తూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డెహ్రాడూన్‌లో విధులు నిర్వహిస్తున్న పూర్ణచంద్రరావు శుక్రవారం రాత్రి ట్రక్కులో వెళుతుండగా, ఒకచోట ఆర్చి ఒక్కసారిగా కూలిపడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌, నాగాలాండ్‌కు చెందిన మరో ఉద్యోగి మృతిచెందారు. పూర్ణచంద్రశేఖర్‌కు భార్య, రెండేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. చంద్రశేఖర్‌ నెలన్నర కిందటే కుటుంబాన్ని డెహ్రాడూన్‌ తీసుకువెళ్లారు. ఇంతలో ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement