• Jul 26, 2026
  • NPN Log

    AISF నేత ప్రేమ ద్రోహం: న్యాయం కోసం ఎస్పీ మెట్లెక్కిన బాధిత యువతి@@అనంతపురం,  జూలై 22@@ప్రేమ పేరుతో నమ్మించి, రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు వేరే యువతితో సన్నిహితంగా ఉంటూ తనను మోసం చేస్తున్నాడని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామిపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. పార్టీ కార్యాలయంలో న్యాయం జరగకపోవడంతో బాధితురాలు చివరకు అనంతపురం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.@@రక్తదానంతో మొదలైన పరిచయం... ప్రేమగా మారి...@@బాధితురాలి కథనం ప్రకారం, మమ్మలదొడ్డి సీపీఐ కాలనీకి చెందిన ఆమెకు 2021లో రక్తం అవసరమైన సందర్భంలో కుల్లాయి స్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఉద్యోగం వచ్చాక ఇంట్లో పెద్దలను ఒప్పించి అధికారికంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వామి, కాకినాడలోని సామ్ ఇనిస్టిట్యూట్‌లో ఆమె చదువుకు ఫీజు, హాస్టల్ ఖర్చులు కూడా భరించాడు.@@"లారీ కింద పడి చస్తా" అని బెదిరింపు, కారులోనే రహస్య పెళ్లి!@@"నన్ను కలవకపోతే లారీ కింద పడి చనిపోతా" అంటూ బెదిరించడంతో 2024 నుండి తామిద్దరం శారీరకంగా దగ్గరయ్యామని యువతి తెలిపింది.@@ఈ ఏడాది ఫిబ్రవరి 14న, వాలెంటైన్స్ డే రోజున ఇంటెల్ కాలేజీ ఎదురుగా తన కారులోనే తన మెడలో పసుపుతాడు కట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తాను స్టూడెంట్ లీడర్ కావడం వల్ల ఫొటోలు బయటకు వస్తే ఇబ్బంది అంటూ పెళ్లి ఫొటోలు తీయనివ్వలేదని, అయితే తామిద్దరూ కలిసి ఉన్న బర్త్ డే ఫొటోలు, పసుపుతాడు తీసేయమంటూ వాట్సాప్‌లో తనకు పంపిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్స్ తన వద్ద సాక్ష్యాలుగా ఉన్నాయని బాధితురాలు పేర్కొంది.@@నిలదీస్తే ఎదురుదాడి, పాత్రపై నిందలు@@కొంతకాలంగా స్వామి ప్రవర్తనలో మార్పు వచ్చి, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే అనుమానంతో ఆరా తీయగా నిజం బయటపడిందని చెప్పింది. దీనిపై నిలదీయడంతో, అసలు తానే తాళి కట్టలేదని బుకాయిస్తున్నాడని, తనను వదిలించుకోవడానికి తనకు నలుగురితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ సీపీఐ పార్టీ ఆఫీసులో లేఖ ఇచ్చి తన శీలాన్ని కించపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.@@పార్టీలో న్యాయం కరువు, అందుకే ఎస్పీకి ఫిర్యాదు@@ఈ విషయంపై గత 15 రోజులుగా సీపీఐ పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగినా నాయకులు పట్టించుకోలేదని, పైగా కుల్లాయి స్వామికే వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు ఆరోపించింది. విసిగిపోయి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించానని, ఎస్పీ స్పందించి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ను కలవాలని సూచించారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని స్పష్టం చేసింది.@@ఇది మొదటిసారి కాదా?@@గతంలో ఉరవకొండలో AISF జిల్లా కార్యదర్శిగా పనిచేసిన మరో విద్యార్థి నేత కూడా రాయంపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని, అప్పట్లో ఊరు విడిచి వెళ్లిన ఆ నేత ఇప్పుడు ఓ దినపత్రికలో విలేఖరిగా కొనసాగుతున్నాడని స్థానికులు గుర్తు చేస్తున్నారు.@@వామపక్ష భావజాలం ముసుగులో ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే, పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement