నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు
జనగామ : దేవరుప్పుల మండలం ముండిచింతతండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. శ్రీయన్(4) అనే బాలుడిని అర్ధరాత్రి రెండు విష సర్పాలు కాటేసాయి. నిద్రలో ఉన్న బాలుడిని మొదట నాగుపాము కాటేసింది. తర్వాత కొద్ది నిమిషాలకే మరో విష సర్పం రక్తపింజరి కాటు వేసినట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రెండు పాములు కాటేయడంతో ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.










Comments