పల్లె నిద్ర'తో ప్రజలకు చేరువగా పోలీసులు – గ్రామాల్లో బస చేస్తూ సమస్యలపై ఆరా – నేరాల నివారణపై విస్తృత అవగాహన: ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు
'
తిరుపతి (నేర విభాగం):
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ 'పల్లె నిద్ర', 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో రాత్రివేళల్లో బస చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ముఖాముఖి సమావేశాల్లో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, గంజాయి నిర్మూలన, రహదారి భద్రతా నియమాలు మరియు ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 'డయల్-112' సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా పర్యటించడం వల్ల ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని, పోలీసు-ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని అధికారులు పేర్కొన్నారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా చైతన్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.










Comments