రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్: సీపీఐ మద్దతు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
- సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్. గోపీనాథ్ డిమాండ్
గుంతకల్లు (ఈనాడు): కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాలైన AISF - AIYF పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు సీపీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్. గోపీనాథ్ తెలిపారు. ఈ మేరకు జూలై 24 (రేపు) నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
మంగళవారం గుంతకల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో జరుగుతున్న పొరపాట్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉపాధి, విద్యా సంబంధిత సమస్యలతో మృతి చెందిన 20 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న AISF - AIYF నాయకులు, విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అణచివేత ధోరణికి నిరసనగా చేపట్టిన ఈ బంద్‌కు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు సహకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.










Comments