వైభవంగా ద్రౌపదీ కల్యాణోత్సవం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాల యానికి అనుబంధమైన ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి అలయ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ద్రౌపదీ కల్యాణం జరిగింది.ముందుగా ద్రౌపదీదేవి సమేత ధర్మరాజస్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు.ఉదయం కూడా చప్పరంపై స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. ఈవో బీకే వెంకటేశులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.










Comments