• Jul 26, 2026
  • NPN Log

    యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య  నటిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వృషకర్మ’. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నాగ చైతన్య తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కోసం.. గత ఏడాదిన్నర కాలంగా పూర్తి సమయాన్ని కేటాయించారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండటంతో, షూటింగ్ పూర్తి కాకముందే మేకర్స్ కీలకమైన బిజినెస్ డీల్స్‌ను క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన జీ గ్రూప్  ఈ సినిమాకు సంబంధించిన టోటల్ నాన్-థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

    ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులతో కూడిన పూర్తి నాన్-థియేట్రికల్ డీల్ సుమారు రూ. 50 కోట్లకు క్లోజ్ అయినట్లు సమాచారం. నాగ చైతన్య సినీ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ, రికార్డు స్థాయి నాన్-థియేట్రికల్ డీల్ కావడం విశేషం. సినిమా సబ్జెక్ట్‌లోని వైవిధ్యం, కమర్షియల్ ఎలిమెంట్స్, యూనిక్ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే జీ గ్రూప్ ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి హక్కులను దక్కించుకుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భారీ డీల్‌తో సినిమా బిజినెస్ వర్గాల్లో సరికొత్త చర్చలు మొదలయ్యాయి.

    శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. సరికొత్త కాంబినేషన్, వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ‘వృషకర్మ’ థియేట్రికల్ బిజినెస్ లోనూ మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement