• May 26, 2026
  • NPN Log

    రంగారెడ్డి : జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. జన్వాడ గ్రామంలో మూడేళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. గ్రామానికి చెందిన కాట్నే శేఖర్ కుమార్తె ప్రియాన్షు (3) ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోనే ఉన్న నీటి సంపులో చిన్నారి పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే స్పందించి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆ పాప మృతి చెందింది.

    అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్న చిన్నారి.. అంతలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో జన్వాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    నివాస ప్రాంతాల్లోని నీటి సంపులు, బావులు, వాటర్ ట్యాంకులకు మూతలు లేదా కవర్లు ఏర్పాటు చేసుకోవాలని, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement