• Jul 26, 2026
  • NPN Log

    కథా బలమున్న వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తూ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన సొంత నిర్మాణ సంస్థ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే ‘సమ్మర్ హాలిడేస్’  అనే వినోదాత్మక చిల్డ్రన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను, నాటి అమాయకత్వంతో కూడిన అనుభూతులను కళ్లకు కట్టేలా దర్శకుడు శ్రీకర్ ఈ అందమైన కథను మలచగా.. మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటించారు. గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం జోరుగా నిర్వహిస్తోంది.

     ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి సహజ నటి జయసుధ  క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ‘సుశీలమ్మ’  అనే ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ పాత్రలో కనిపించనున్నారు. ప్రతీ ఇంట ఉండే అమ్మమ్మ మనసును, పల్లెటూరి వాతావరణంలో మనవళ్లు, మనవరాళ్లతో ఆమె పంచుకునే ఆప్యాయతలను ప్రతిబింబించేలా ఈ పాత్ర ఉండబోతోంది. విడుదల చేసిన పోస్టర్‌లో జయసుధ ఎంతో సహజంగా, ఆప్యాయత చిందే చిరునవ్వుతో కనిపిస్తూ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటున్నారు. ఈ సుశీలమ్మ క్యారెక్టర్ థియేటర్లలో వీక్షకులకు ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

     

    జయసుధతో పాటు ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో అలరించనున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు చేసే అల్లరి, ఊరి వాతావరణం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ తమ బాల్యంలోకి తీసుకెళ్తుందని ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు, గ్రాండ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement