వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. మత్స్యకారులకు అధికారుల హెచ్చరిక..
అమరావతి : వాయవ్య బంగాళాఖాతం.. దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మత్స్యకారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని తేల్చి చెప్పింది. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలు ఉపయోగించడం సురక్షితం కాదని తెలిపింది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.









Comments