కోహ్లీ రెస్టారెంట్ మెనూ.. ప్లేట్ బిర్యానీ రేటెంతో తెలిస్తే షాకే..
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. క్రికెట్ లో రాణిస్తున్న కోహ్లీ.. . కొన్నేళ్ళ క్రితం 'వన్ 8 కమ్యూన్' పేరుతో చైన్ రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభించాడు.
ముంబైలోని జుహూ ప్రాంతంలో దివంగత లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ బంగ్లాను రీమోడల్ చేసి, అక్కడ ఈ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. విభిన్నమైన ఫుడ్ ఐటెమ్స్ తో అదరగొడుతున్న ఈ రెస్టారెంట్ లో రేట్లు మాత్రం ఎక్కువేనన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా కోహ్లీ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూ నెట్టింట వైరల్ గా మారింది. ఒక ప్లేట్ బిర్యానీ రేటు చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.
సాధారణ హోటల్స్ లో ప్లేట్ చికెన్ బిర్యానీ రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. అలాగే ఒక చపాతీ లేదా రోటీ రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుంది. అదే కాస్తా పెద్ద హోటల్స్ లేదా రెస్టారెంట్లో అయితే బిర్యానీ రూ.300- రూ.400, చపాతీ , తందూరీ రూ.40 నుంచి రూ. 70 వరకూ ఉంటుంది. కానీ కోహ్లీ రెస్టారెంట్లో మాత్రం వీటి రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి.
తందూరీ రోటీ, బేబీ నాన్ ధర రూ.118, సాల్టెడ్ ఫ్రైస్ ధర రూ.348, లక్నో దమ్ ల్యాంబ్ బిర్యానీ ధర రూ. 978, చికెన్ చెట్టినాడ్ బిర్యానీ ధర రూ. 878, ఒక ప్లేట్ ప్లెయిన్ రైస్ ధర రూ.318 గా ఉంది. ఇక్కడ అత్యంత ఖరీదైన వంటకం నాన్ వెజ్ ల్యాంబ్ షాంక్. దీని రేటు రూ.2318గా ఉంది. అలానే మస్కార్పోన్ చీజ్ కేక్ రూ.748, కోహ్లీ స్పెషల్ చాక్లెట్ మౌస్ రూ.818, సిగ్నేచర్ సిజ్లింగ్ క్రోసెంట్ ధర రూ.918గా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూ జొమాటోలో అందుబాటులో ఉంది.






Comments